సైరా నరసింహారెడ్డి మళ్ళీ వాయిదా పడింది


sye-raa-narasimha-reddy-second-schedule-postponed

మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రం ” సైరా …… నరసింహారెడ్డి ”. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై మెగా ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే ఎంత ఆసక్తి కనబరుస్తున్నారో అంత ఆలస్యం అవుతోంది ఈ సినిమా . ఎప్పుడో చిరంజీవి పుట్టినరోజైన ఆగస్ట్ లో ప్రారంభం కాగా రెగ్యులర్ షూటింగ్ కి చాలా సమయం తీసుకుంది . మెల్లిగా మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది దాంతో ఇక వేగంగా పూర్తవుతుంది అని అనుకున్నారు కట్ చేస్తే రెండో షెడ్యూల్ కి విపరీతమైన సమయం తీసుకుంటోంది ఆ చిత్ర బృందం .

 

ఇప్పటికే పలుమార్లు వాయిదా పడగా తాజాగా రెండో షెడ్యూల్ ఈ మార్చిలో కూడా కాకుండా ఏప్రిల్ కు వాయిదా పడింది దాంతో మెగా అభిమానులు నిరాశలో ఉన్నారు . అమితాబ్ బచ్చన్ , నయనతార , జగపతిబాబు తదితర తారాగణం నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు రాంచరణ్ .