దుమ్మురేపుతున్న సైరా టీజర్


Sye Raa Teaser
Sye Raa Teaser

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఆ టీజర్ చూస్తుంటే ఒళ్ళు గగుర్పాటు కి గురవడం ఖాయం అంత అద్భుతంగా ఉంది సైరా టీజర్. కొణిదెల ప్రొడక్షన్స్ మేకింగ్ ఏంటో మరోసారి చాటి చెప్పారు. ఎక్కడా ఖర్చుకు వెనుకడకుండా భారీ విజువల్స్ తో సైరా ని ఔరా ….. అనిపించారు. విజువల్స్ అద్భుతం , దర్శకత్వం అద్భుతం , మేకింగ్ కూడా నభూతో నభవిష్యత్ అన్నట్లుగా సాగింది.

బ్రహ్మాండమైన విజువల్స్ తో వచ్చిన టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్2 న విడుదల కానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి తో పాటుగా అమితాబ్ బచ్చన్ , నయనతార , జగపతిబాబు , సుదీప్ , విజయ్ సేతుపతి , తమన్నా , నిహారిక తదితరులు నటించారు. సైరా టీజర్ తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.