సైరా నరసింహారెడ్డి ట్రైలర్ రివ్యూ


Sye Raa Narasimha Reddy Trailer
Sye Raa Narasimha Reddy Trailer

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సైరా నరసింహారెడ్డి ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. 2 నిమిషాల 53 సెకెన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో కథ ఏంటనేది హింట్ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటన ఫ్యాన్స్ కే కాదు ప్రేక్షకులకు కూడా సంతోషాన్నిచ్చేదిగా ఉంది. ట్రైలర్ లో మొత్తం బెస్ట్ షాట్స్ పెట్టినట్టుగా ఉంది. విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా, నయనతార, అమితాబ్.. ఇలా ప్రతీ ఒక్కరినీ ట్రైలర్ లో ఒక్కో డైలాగ్ తో చూపించారు.

అన్నిటికన్నా ముఖ్యమైన విషయం సైరా నరసింహారెడ్డి క్లైమాక్స్ విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్ కు కూడా ఈ ట్రైలర్ తో ఫుల్ స్టాప్ పెట్టేసారు. నరసింహారెడ్డిని నీ ఆఖరి కోరిక ఏంటని బ్రిటీషు వారు అడగడం, తర్వాత బహిరంగంగా ఉరి తీయడానికి ఉరి కంభం వద్ద నరసింహారెడ్డిని నిలబెట్టిన సన్నివేశం ఈ విషయంలో క్లారిటీ ఇస్తాయి. ట్రైలర్ చూస్తుంటే భారతీయుడిగా రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. “ఈ భూమ్మీద పుట్టింది మేము, ఈ మట్టిలో కలిసేది మేము, నీకెందుకు కట్టాలిరా శిస్తు” అన్న డైలాగ్ బాగుంది.

మొత్తమ్మీద పెద్దగా ప్రమోషన్లు లేక నీరసించిపోయి ఉన్న మెగా అభిమానులకు సైరా ట్రైలర్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పాలి. మరోసారి సినిమా విడుదలయ్యేది అక్టోబర్ 2న అనే క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఇకనుండి ప్రమోషన్లు ఫుల్ స్వింగ్ లో ఉంటాయని ఆశించవచ్చు.