చిరంజీవి సైరా సరికొత్త సంచలనం


Sye raa Narasimhareddy creates non baahubali record in Karnataka
Sye raa Narasimhareddy creates non baahubali record in Karnataka

 

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంతో సరికొత్త సంచలనం సృష్టించాడు . సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని కర్ణాటకలో సొంతం చేసుకోవడానికి ఏకంగా 32 కోట్లకు బేరం కుదుర్చుకున్నారని తెలిసి షాక్ అవుతున్నారు ట్రేడ్ వర్గాలు . కర్ణాటకలో తెలుగు చిత్రాలకు అందునా అగ్ర హీరోలకు భారీ డిమాండ్ ఉంది . ఇక చిరంజీవి చిత్రాలకు అయితే తెలుగులో మాదిరిగానే విపరీతమైన డిమాండ్ ఉంది .

దాంతో పోటీకి వెళ్లి 32 కోట్లకు కర్ణాటక హక్కులను సొంతం చేసుకున్నారట అంటే బాహుబలి రికార్డ్ లకు దగ్గరలో ఉందన్న మాట . ఇక నాన్ బాహుబలి చిత్రాల్లో సైరా నెంబర్ వన్ గా నిలిచింది . సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్నాడు చిరు . ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 2 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .