సైరా మేకింగ్ వీడియో వచ్చేది ఎప్పుడో తెలుసా ?


Sye Raa Narasimhareddy Making Video gets a release date
Sye Raa Narasimhareddy Making Video gets a release date

సైరా మేకింగ్ వీడియో వచ్చేది ఎప్పుడో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి మేకింగ్ వీడియోని విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది .
ఇంతకీ సైరా మేకింగ్ వీడియో వచ్చేది ఎప్పుడో తెలుసా ? రేపే …….. ఆగస్టు 14 సాయంత్రం సైరా మేకింగ్ వీడియో విడుదల చేయనున్నారు .
ఎల్లుండి ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మేకింగ్ వీడియో రిలీజ్ చేయనున్నారు సైరా టీమ్ .

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార ,అమితాబ్ , విజయ్ సేతుపతి , సుదీప్ , జగపతిబాబు , తమన్నా తదితరులు నటిస్తున్నారు .
ఇక అక్టోబర్ 2 న సైరా నరసింహారెడ్డి చిత్రం విడుదల కానుంది . భారీ బడ్జెట్ తో సైరా చిత్రాన్ని చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే . సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరెకెక్కింది .