సైరా పిక్స్ మళ్ళీ లీక్


sye raa.... narasimhareddy pics leaked! increase expectationsభారీ సినిమాలను లీక్ లు పట్టి పీడిస్తున్నాయి , ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ….. ఎన్ని నిర్బంధాలు విధిస్తున్నప్పటికీ ఈ లీకుల బెడద మాత్రం తగ్గడం లేదు . ఇప్పటికే పలు చిత్రాల తాలూకు వీడియో ఫుటేజ్ , స్టిల్స్ లీక్ అయి ఆ చిత్ర బృందాలను షాక్ కి గురి చేయగా తాజాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ” సైరా …… నరసింహారెడ్డి ” చిత్రంలోని పిక్స్ లీకై ఆ చిత్ర బృందాన్ని షాక్ కి గురి చేస్తున్నాయి . తాజాగా సోషల్ మీడియాలో సైరా పిక్స్ అంటూ రెండు ఫోటోలు వైరల్ గా మారాయి . కోట బురుజు మంటల్లో ద్వంసం అవుతున్న ఫోటో ఒకటి అలాగే మంటల్లో చిక్కుకున్న కోట బురుజు ముందు విజయదరహాసం చేస్తున్న బ్రిటీష్ మూక కు సంబందించిన ఫోటో ఒకటి …… ఈ రెండు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని చరణ్ నిర్మిస్తుండగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు . చిరు సరసన నయనతార నటిస్తుండగా బిగ్ బి అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం చిరంజీవి , చరణ్ లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ లీకులు మాత్రం ఆగడం లేదు . అయితే ఇలా లీక్ అయినప్పటికీ మెగాస్టార్ అభిమానులకు మాత్రం సంతోషమే ! ఎందుకంటే ఇలా ఆ సినిమా తాలూకు విశేషాలు తెలుస్తున్నాయి గా అందుకు .

English Title: sye raa…. narasimhareddy pics leaked! increase expectations