పవన్ కళ్యాణ్ కు బాగా నచ్చిందట


Sye raa narasimhareddy teaser creates new trendసైరా ……. నరసింహారెడ్డి టీజర్ పవన్ కళ్యాణ్ బాబాయ్ కి బాగా నచ్చిందని అభిమానులకు చెప్పాడు అబ్బాయ్ రాంచరణ్ తేజ్ . నిన్న రాత్రి మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు అశేష అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున జరిగాయి కాగా ఆ వేడుకలలో మెగాస్టార్ చిరంజీవి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తప్ప అందరూ పాల్గొన్నారు . కాగా ఆ వేడుకలోనే సైరా టీజర్ నా దగ్గరకు రాగానే మొదట కళ్యాణ్ బాబాయ్ కే పంపించాను అది చూసాక అదిరిపోయింది , థియేటర్ లో ఎప్పుడు చూస్తానా ? అని ఆతృతగా ఉందని సందేశం పెట్టాడట చరణ్ కు . అదే విషయాన్నీ అభిమానులతో పంచుకొని సంతోషపడ్డాడు చరణ్ .

నిన్న రిలీజ్ అయిన సైరా …. నరసింహారెడ్డి టీజర్ కు బ్రహ్మరథం పడుతున్నారు అభిమానులు . యు ట్యూబ్ లో సైరా టీజర్ పెట్టడమే ఆలస్యం ట్రెండ్ అయ్యింది . భారీ విజువల్స్ , చిరు పవర్ ఫుల్ డైలాగ్ వెరసి సైరా అన్ని రికార్డులను బద్దలు కొట్టే సినిమాగా రూపొందుతోంది అన్నది మాత్రం స్పష్టం అయ్యింది టీజర్ చూసాక . ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకుడు సురేందర్ రెడ్డి కాగా నిర్మాత చరణ్ కావడం విశేషం .

English title: Sye raa narasimhareddy teaser creates new trend