సైరా నరసింహారెడ్డి ట్రైలర్ అక్కడ రిలీజ్ చేస్తారా ?


Sye-Raa-Narasimha-Reddy
Sye-Raa-Narasimha-Reddy

సైరా నరసింహారెడ్డి చిత్ర ట్రైలర్ ని దుబాయ్ లో జరుగనున్న సైమా అవార్డుల వేడుకలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట . ఆగస్టు 15 , మరియు 16 వ తేదీలలో రెండు రోజుల పాటు ఈ అవార్డుల వేడుక సాగనుంది . పైగా తెలుగు మాత్రమే కాకుండా హిందీ , తమిళ ,కన్నడ , మలయాళ భాషలకు సంబందించిన అవార్డుల వేడుక కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుకలకు అత్యంత ప్రాధాన్యత ఉంది కాబట్టి అక్కడ సైరా నరసింహారెడ్డి ట్రైలర్ ని విడుదల చేస్తే భారీ స్థాయిలో ప్రచారం కల్పించినట్లు అవుతుందని భావిస్తున్నారట సైరా టీమ్ .

దాంతో ఆగస్టు 15 లేదా 16 న సైరా నరసింహారెడ్డి ట్రైలర్ ని విడుదల చేయడం ఖాయమని అంటున్నారు . ఇలా చేయడం వల్ల సైరా పై మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం . చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది ఈ సైరా . సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చరణ్ నిర్మిస్తుండగా అమితాబ్ బచ్చన్ తో పాటుగా సౌత్ లో ఉన్న అందరూ ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం .