సైరా టీజర్ బాగుంది కానీ ….


sye raa teaser is not trending in you tube but creates record

సైరా ….. నరసింహారెడ్డి టీజర్ బాగానే ఉంది కానీ అది యూట్యూబ్ లో మాత్రం ట్రెండ్ కాలేదు దాంతో సైరా టీమ్ చెబుతున్న లెక్కలు సరైనవేనా ? అన్న అనుమానం నెలకొంది . సైరా నరసింహారెడ్డి టీజర్ అద్భుతంగా ఉంది అందులో అనుమానం లేదు కానీ వ్యూస్ పరంగా చెబుతున్న లెక్కలే కారణం . ఒకవేళ సైరా నరసింహారెడ్డి ట్రెండ్ సృష్టించినట్లైతే తప్పకుండా యూట్యూబ్ ట్రెండ్స్ లో సైరా పేరు ఉండేది కానీ ట్రెండ్స్ లో మాత్రం ఎక్కడా సైరా పేరు లేదు దాంతో ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి వ్యతిరేకులు . అయితే వ్యతిరేకుల మాటలు ఎలా ఉన్నప్పటికీ , ట్రెండ్ కానప్పటికీ యు ట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన మొట్టమొదటి తెలుగు చిత్రంగా రికార్డ్ సృష్టించింది సైరా నరసింహారెడ్డి .

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని చరణ్ నిర్మిస్తుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . భారీ విజువల్స్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ కావడం గమనార్హం . బ్రిటిష్ వాళ్లతో పోరాడిన వీరుడి గాధ కావడంతో మొదటినుండి ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి అయితే టీజర్ రిలీజ్ అయ్యాక మాత్రం బాక్సాఫీస్ ని కుమ్మేసే సినిమా అంటూ మెగా ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు . తెలుగు , తమిళ , హిందీ బాషలలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార , జగపతి బాబు , విజయ్ సేతుపతి తదితర ప్రముఖులు నటిస్తున్నారు .

English Title: sye raa teaser is not trending in you tube but creates record