ఒక గండం దాటినా “సైరా”


Syeraa Censor
ఒక గండం దాటినా “సైరా”

తెలుగు సినిమాల విషయానికి వస్తే ఎవ్వరి మనోభావాలు దెబ్బతినకుండా, మంచి సినిమా టైటిల్ పెట్టి, మంచిగా ట్రైలర్, సాంగ్స్ విడుదల చేయడం ఒక ఎత్తు. అదే పెద్ద సినిమా అనుకో మాకు ఆ విభేదాలు, ఈ విభేదాలు ఉన్నాయి అని గొడవ చేస్తారు. ఒక్కోసారి సెన్సార్ వాళ్ళు కూడా ప్రాబ్లెమ్ ఉంది అని చెప్తారు. అలా అన్నింటిని దాటుకొని వస్తున్న సినిమా “సైరా నరసింహా రెడ్డి” సెన్సార్ విషయం లో గెలిచింది.

సినిమా ఈ రోజు సెన్సార్ రిపోర్ట్ కి వెళ్ళింది, ఒక్క కట్ కూడా లేకుండా జాగ్రత్తగా “సురేందర్ రెడ్డి” దర్శకత్వం చేసారు, అందుకే సినిమాకి యు/ఏ (U/A) ఇచ్చారు, సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలు ఉంది అని అంటున్నారు. నిజంగా ఒక సైరా లాంటి పెద్ద సినిమాకి యు/ఏ రావడం, ఒక్క కట్ కూడా లేకుండా ఒకే చెప్పడం, అదికూడా వారానికి ముందే సినిమాని సెన్సార్ చేయించడం ఇవన్నీ కలిపి ఒక గండం నుండి తప్పించినట్లే కదా.

అయితే సైరా కి కూడా ముందు వాల్మీకి సినిమాకి జరిగినట్లు గొడవలు, అల్లర్లు జరిగాయి, వాటిని మీడియా వాళ్ళు భూతద్దం లాగ చూపియ్యడం సిగ్గుచేటు అని అంటున్నారు సినిమా ప్రియులు.

ఇకనైనా ఒక పెద్ద సినిమా వస్తుంది అంటే, సినిమాకి ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలి అంటున్నారు చిత్ర నిర్మాణ రంగంలో పనిచేసేవారు.