100 కోట్ల మార్క్ కు అతి చేరువలో సైరా


100 కోట్ల మార్క్ కు అతి చేరువలో సైరా
100 కోట్ల మార్క్ కు అతి చేరువలో సైరా

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి మిగతా ఏరియాల సంగతి ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్టడీగా ఉంది. ఈ చిత్రం 10వ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 88 లక్షల షేర్ సాధించింది. దీంతో 10 రోజుల మొత్తం 94.72 కోట్ల షేర్ సాధించినట్లైంది. ఈ రెండు రోజులు వారాంతం కావడంతో సైరా కలెక్షన్స్ మరోసారి ఊపందుకోనున్నాయి. తెలంగాణలో మరో రెండు రోజులు సెలవులు పొడిగించే ఆలోచనలో కేంద్రం ఉండడంతో అది కూడా సైరాకు ప్లస్ కానుంది.

మొత్తమ్మీద సైరా వచ్చే వారం మొదట్లో 100 కోట్ల మార్క్ కు చేరుకోనుంది. దాంతో బాహుబలి, రంగస్థలం తర్వాత 100 కోట్ల షేర్ తెలుగు రాష్ట్రాల్లో సాధించిన మూడో చిత్రంగా సైరా నిలవనుంది. 10 రోజుల సైరా తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ బ్రేకప్ ఇక్కడ చూడండి.

ప్రాంతం షేర్ (కోట్లలో)

నైజాం 28.60

సీడెడ్ 17.09

నెల్లూరు 4.18

కృష్ణ 6.89

గుంటూరు 9.02

వైజాగ్ 14.42

ఈస్ట్ 8.45

వెస్ట్ 6.07

మొత్తం 94.72