సైరా రెండు రోజుల తెలుగు రాష్ట్రాల వసూళ్లు


Sye Raa 2 Days Collections
Sye Raa 2 Days Collections

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రివ్యూలు పాజిటివ్ గా ఉండి, ప్రేక్షకుల మొదటి స్పందన కూడా అదిరిపోవడంతో సైరా ప్రభంజనం సృష్టిస్తోంది. అన్ని చోట్లా రికార్డు కలెక్షన్లు సాధిస్తూ మెగాస్టార్ రేంజ్ ను ఈ తరం వారికి తెలియజెప్పేలా చేసింది.

సైరా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 38.73 కోట్ల షేర్ సాధించగా, రెండు రోజులకు కలిపి 48 కోట్లు వసూలు చేసింది. వర్కింగ్ డే కావడంతో కలెక్షన్స్ కొంత తగ్గుముఖం పట్టాయని, మళ్ళీ వారాంతం కావడంతో కలెక్షన్స్ పుంజుకునే అవకాశమున్నట్లు ట్రేడ్ అనలిస్ట్స్ అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ బాగున్నా హిందీ వసూళ్లు అంత ఆశాజనకంగా లేకపోవడంతో భారీ ఓపెనింగ్ కు గండి పడింది. ఓవర్సీస్ లో, కర్ణాటకలో వచ్చిన షేర్స్ బాగున్నాయి.

మరి దసరా సెలవుల అడ్వాంటేజ్ ఉండడంతో సైరా ఎలా పెర్ఫర్మ్ చేస్తుంది అనేది చూడాలి.

సైరా నరసింహారెడ్డి రెండు రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఇక్కడ చూద్దాం.
:
ప్రాంతం                                  షేర్ (కోట్లలో)

నైజాం                                       12.08

సీడెడ్                                        7.66

నెల్లూరు                                    2.40

కృష్ణ                                         3.74

గుంటూరు                                5.73

వైజాగ్                                       6.36

తూర్పు గోదావరి                       5.88

పశ్చిమ గోదావరి                       5.37

1ST DAY AP & TS SHARE       48.22