సైరా 2 వారాల కలెక్షన్స్.. నెమ్మదించిన వసూళ్లు


సైరా 2 వారాల కలెక్షన్స్.. నెమ్మదించిన వసూళ్లు
సైరా 2 వారాల కలెక్షన్స్.. నెమ్మదించిన వసూళ్లు

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రానికి మంచి టాక్ తో పాటు దసరా సెలవుల అడ్వాంటేజ్ కూడా కలిసిరావడంతో తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ వసూళ్లు సాధించింది. మిగతా భాషల్లో ఫెయిల్ అయిన సైరా, తెలుగులో మాత్రం చిరు ఇమేజ్ కారణంగా తిరుగులేనిదిగా ముందుకు సాగింది. అయితే దసరా సెలవులు అయిపోవడం, సైరా వేడి కూడా తగ్గడంతో కలెక్షన్స్ నెమ్మదించాయి.

ఆదివారం దాకా బాగానే ఉన్న వసూళ్లు సోమవారం నుండి తగ్గుముఖం పట్టాయి. అనుకోకుండా నైజాంలో మరో వారం రోజులు సెలవు దినాలు ప్రభుత్వం ప్రకటించడం కొంత ఊరట. దీంతో 14వ రోజు సైరా తెలుగు రాష్ట్రాల్లో 84 లక్షల షేర్ వసూలు చేయగలిగింది. మొత్తంగా సైరా రెండు వారాలకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో 102.54 కోట్ల షేర్ ను సాధించింది.

2 వీక్స్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ ఇక్కడ చూద్దాం..

ప్రాంతం షేర్ (కోట్లలో)

నైజాం 31.71

సీడెడ్ 18.64

నెల్లూరు 4.41

కృష్ణ 7.29

గుంటూరు 9.42

వైజాగ్ 15.76

ఈస్ట్ 8.92

వెస్ట్ 6.39

మొత్తం 102.54