సెంచరీ దిశగా అడుగులేస్తున్న సైరా


syeraa 8 days collections
syeraa 8 days collections

మిగతా ప్రాంతాల సంగతి ఎలా ఉన్నా సైరా నరసింహారెడ్డి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతోంది. దసరా సెలవుల అడ్వాంటేజ్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న సైరా ఇప్పుడు సెంచరీ దిశగా అడుగులేస్తోంది. విజయదశమి రోజు వచ్చిన కలెక్షన్స్ కన్నా దాని తర్వాతి రోజు ఎక్కువ కలెక్షన్స్ రావడం విశేషం.

ఈరోజు నుండి పెరిగిన టిక్కెట్ రేట్లు సాధారణ స్థితికి రానుండడంతో కలెక్షన్స్ నిలకడగా ఉంటాయని భావిస్తున్నారు ట్రేడ్ పండితులు. అదే జరిగితే కనుక సైరా రానున్న రెండు, మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల మార్క్ ను దాటడం ఖాయం. ముఖ్యంగా నైజాంలో సైరా మంచి వసూళ్లు రాబడుతోంది.

8 రోజులకు తెలుగు రాష్ట్రాల సైరా కలెక్షన్స్ బ్రేక్ డౌన్ :
ప్రాంతం          షేర్ (కోట్లల్లో)
నైజాం                  26.43
సీడెడ్                   16.25
నెల్లూరు                4.04
కృష్ణ                      6.68
గుంటూరు             8.80
వైజాగ్                  13.41
ఈస్ట్                      8.10
వెస్ట్                      5.88
మొత్తం                89.59