సైరా ఆడియో విడుదల తేదీ ఖరారు


Syeraa Narasimha Reddy
Syeraa Narasimha Reddy

మెగాస్టార్ చిరంజీవి నటించిన పీరియాడిక్ డ్రామా సైరా నరసింహారెడ్డిపైనే ప్రస్తుతం ఇండస్ట్రీ దృష్టాంతా ఉంది. అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. అంటే విడుదలకు పట్టుమని 20 రోజులు కూడా లేదు.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ముందుగా సైరా ఆడియో విడుదలను ఈ నెల 18న చేయాలని ప్లాన్ చేస్తోంది.

దీనికి సంబంధించిన వేదికను త్వరలో ప్రకటిస్తారు. ఇది కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు. వీటికి అదనంగా ముంబై, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఆయా వెర్షన్స్ కు సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ జరుగుతాయి.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రమోషన్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడవుతాయి.