ప్రభాస్ థియేటర్లో సైరా రికార్డు


syeraa beats saaho record for first week
syeraa beats saaho record for first week

ఇటీవలే సూళ్లూరుపేటలో ‘వి ఎపిక్’ పేరిట ఒక భారీ మల్టిప్లెక్స్ చైన్ ప్రారంభమైన విషయం తెల్సిందే. ఇందులో యూవీ క్రియేషన్స్ అధినేతలు, ప్రభాస్ కలిపి పెట్టుబడులు పెట్టారు. ఇందులో ఒక స్క్రీన్ ఇండియాలోనే అతిపెద్దదిగా రికార్డు నెలకొల్పింది. సాహో ఈ మల్టీప్లెక్స్ లో స్క్రీనింగ్ అయిన మొదటి సినిమా. ఈ చిత్రం వి ఎపిక్ లో తొలి వారం 46,87,100 రూపాయల షేర్ సాధించింది. సింగిల్ స్క్రీన్స్ వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఇదే అత్యధిక వసూళ్ల రికార్డు.

అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ఇదే మల్టీప్లెక్స్ లో అత్యంత ఆదరణ మధ్య ప్రదర్శింపబడుతోంది. ఈ చిత్రం వి ఎపిక్ లో మొదటి వారానికి 47,21,210 రూపాయల షేర్ సాధించి సాహో రికార్డును అధిగమించింది. ప్రస్తుతం ఇదే సింగిల్ స్క్రీన్స్ పరంగా మొదటి వారానికి అత్యధిక షేర్ సాధించిన చిత్రం.

నిన్న దసరా పండగ సందర్భంగా సైరా కలెక్షన్స్ మరోసారి ఊపందుకున్నాయి. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. మరి ఈరోజు నుండి సైరా ఎలా పెర్ఫర్మ్ చేస్తుందన్న దాన్ని బట్టి చిత్ర భవిష్యత్ ఆధారపడి ఉంది.