సైరా క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ అయిపోయిందే!


Sye Raa climax part revealed
Sye Raa climax part revealed

మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ పీరియాడిక్ డ్రామా సైరా నరసింహారెడ్డి. భారతదేశ తొలి స్వాతంత్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెల్సిందే. చరిత్ర చెబుతున్న దాని ప్రకారం బ్రిటీషు వారిని గడగడలాడించిన నరసింహారెడ్డిని దొంగ దెబ్బ తీసి పట్టుకుని ఆయన తల నరికి బురుజుకు వేలాడదీశారట. అయితే ఇక్కడ మెగాస్టార్ ఫ్యాన్స్ ఈ సన్నివేశానికి ఒప్పుకోరు కాబ్బటి క్లైమాక్స్ లో ఈ పోర్షన్ ఉండదని, బ్రిటీషు వారు పట్టుకునే దాకా చిత్రీకరించారని మొదట అన్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం, చరిత్రలో ఉన్నది ఉన్నట్లు సైరా టీమ్ చిత్రీకరించారట. నరసింహారెడ్డి చనిపోయే సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయని అంటున్నారు. మరి దీనిని మెగా అభిమానులు ఎలా తీసుకుంటారో చూడాలి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాత.