మొదటిరోజే 1 మిలియన్ కొట్టేసిన సైరా


మొదటిరోజే 1 మిలియన్ కొట్టేసిన సైరా
మొదటిరోజే 1 మిలియన్ కొట్టేసిన సైరా

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అవ్వడానికి ఇది ఒక స్వతంత్ర యోధుడి గురించిన కథే అయినా ఇందులో మాస్ ఎలివేషన్లను బాగా పెట్టడంతో ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ను పూనకాలే అని చెప్పాలి. చిరంజీవి కల నెరవేర్చిన సైరా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది.

అయితే ఈ చిత్రంపై ఉన్న బజ్ కారణంగా అన్ని చోట్లా రికార్డు స్థాయిలో ప్రీ సేల్స్ జరిగిన విషయం తెల్సిందే. ముఖ్యంగా యూఎస్ లో ప్రేక్షకులు సైరాపై ఆసక్తి కనబర్చారు. అందుకే ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారానే $817,662 వసూలు చేసింది. ఇంకా బుధవారం అక్కడి కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు అందిన సమాచారం బట్టి తొలిరోజు $234,471 వచ్చాయి. అంటే ఇక్కడికే $1,052,133 సాధించి మొదటిరోజే 1 మిలియన్ మార్కును సగర్వంగా దాటింది.

ఇక కెనడా వసూళ్లు కూడా చూసుకుంటే $1.15 మిలియన్ డాలర్లు కూడా దాటుతుంది. ఇప్పటికే మంచి రివ్యూలు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి భారీ స్పందన వస్తుండడంతో సూపర్ హిట్ దిశగా సాగుతుంది. చిరంజీవి నరసింహారెడ్డి పాత్రలో నటించిన ఈ చిత్రంలో నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్, అమితాబ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు.