సైరా డే 1 నైజాం కలెక్షన్స్ : సాలిడ్


సైరా డే 1 నైజాం కలెక్షన్స్ : సాలిడ్
సైరా డే 1 నైజాం కలెక్షన్స్ : సాలిడ్

మెగాస్టార్ చిరంజీవి పిరియాడికల్ డ్రామా సైరా నరసింహారెడ్డికి టాక్ మొదటినుండి బాగా వచ్చింది. ఈ చిత్రం అందరికీ తెగ నచ్చేస్తోంది. మొదటిరోజే ప్రీ సేల్స్ బాగుండడంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో సాగుతున్నాయి. మొదటి రోజు సైరా నరసింహారెడ్డి నైజాంలో కుమ్మేసిందని చెప్పాలి. అక్కడ ఈ చిత్రం అద్భుతంగా రాణిస్తోంది. మొదటిరోజు నైజాంలో సైరా 7.9 కోట్ల షేర్ సాధించింది.

ఇక ముందుంది దసరా సెలవులు కావడంతో సైరా నరసింహారెడ్డి వసూళ్లు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది. కొన్ని వారాల పాటు పెద్ద సినిమాలు ఏవీ విడుదలకు లేకపోవడంతో సైరాకు ఇక ఎదురులేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించాడు.

సైరా నరసింహారెడ్డి డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మరికాసేపట్లో పోస్ట్ చేయనున్నాం.