రికార్డు ధరకు అమ్ముడైన సైరా డిజిటల్ రైట్స్


Sye Raa Digital Rights
Sye Raa Digital Rights

సైరా నరసింహారెడ్డి విడుదలకు ఇంకా మూడు వారాల సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మరికొన్ని రోజుల్లో ప్రమోషన్స్ ను భారీ ఎత్తున మొదలుపెట్టనున్నారు. మరోవైపు విడుదల దగ్గరపడుతుండడంతో ఈ చిత్రానికి సంబందించిన బిజినెస్ డిటైల్స్ బయటకు వస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర డిజిటల్ హక్కులు దాదాపు 40 కోట్లకు అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది. అమెజాన్ సంస్థ ఇంత భారీ మొత్తం వెచ్చించడానికి ముందుకు వచ్చింది.

సినిమా విడుదలైన రెండు నెలల తర్వాతే సినిమాను ప్రైమ్ లో విడుదల చేస్తరని తెలుస్తోంది. ఇంకా సాటిలైట్ హక్కుల విషయానికి సంబంధించిన అప్డేట్ తెలియాల్సి ఉంది. మొత్తమ్మీద ఈ చిత్రానికి హైప్ అయితే భారీగానే ఉంది. ఇంకా కొన్ని ప్రాంతాలకి థియేట్రికల్ బిజినెస్ కూడా పూర్తి కావాల్సి ఉంది. నయనతార ఫీమేల్ లీడ్ గా చేస్తోన్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకుడు.