సైరా డిజిటల్ రైట్స్ పై వినిపిస్తున్న వార్తల్లో నిజమెంత?


Sye Raa Narasimha Reddy
సైరా డిజిటల్ రైట్స్ పై వినిపిస్తున్న వార్తల్లో నిజమెంత?

మెగాస్టార్ చిరంజీవి భారతదేశ మొదటి పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డిలో నటించిన సంగతి తెల్సిందే. మొదటినుండి ఎలా ఉన్నా ట్రైలర్ విడుదల కాగానే ఈ చిత్రంపై బజ్ ఒక రేంజ్ లో వచ్చింది. అప్పటిదాకా సైరా రేంజ్ పై సందేహాలు వ్యక్తం చేసిన వాళ్లకు కూడా ఒక క్లారిటీ వచ్చింది, ఇది సాదాసీదాగా తీసిన సినిమా కాదని.

దాంతో ఆటోమేటిక్ గా బిజినెస్ పరంగా క్రేజ్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ మధ్య వచ్చిన ఒక వార్త.. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఒకటి సైరా డిజిటల్ హక్కులను అన్ని భాషలకు కలిపి గుంపగత్తగా 125 కోట్లకు కొనుగోలు చేసారని. అయితే ఇప్పుడు ఈ వార్త తప్పని తెలుస్తోంది. సైరా సౌత్ భాషలకు అన్నిటికీ కలిపి సాటిలైట్ రైట్స్ కింద సన్ నెట్వర్క్ వారు 25 కోట్లు చెల్లించారట. హిందీ వేరే ఛానల్ వారికి విక్రయించబోతున్నట్లు వినికిడి. అలాగే అమెజాన్ ప్రైమ్ డిజిటల్ హక్కులకు అన్ని భాషలకు కలిపి 50 కోట్లకు డీల్ సెట్ చేసుకున్నారట. మరి వీటిలో ఏది నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించారు. అక్టోబర్ 2న సైరా నరసింహారెడ్డి విడుదల కాబోతోంది.