తొందరపడి దెబ్బతిన్న గోపీచంద్

Syeraa effect on Chanakya
Syeraa effect on Chanakya

అక్టోబర్ 2న మెగాస్టార్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలవుతుంటే సరిగ్గా మూడు రోజుల తర్వాత తన సినిమాను విడుదల చేయడం ద్వారా గోపీచంద్ ఎంత పెద్ద తప్పు చేసాడో ఇప్పుడు అతనికి అర్ధమవుతుండచ్చు. అక్టోబర్ 5న గోపీచంద్ నటించిన చాణక్య విడుదలవుతున్నప్పుడు దాదాపు అందరూ ఈ టైంలో అవసరమా అనే అభిప్రాయాన్ని వెల్లడించారు.

అయినా కానీ వినకుండా దసరా సీజన్ లో రెండు సినిమాలు విడుదల కావొచ్చు అని చెప్పి రిలీజ్ చేసుకున్నాడు. చాణక్య సినిమాకు బ్యాడ్ టాక్ రాగా, సైరా సూపర్ కలెక్షన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోయింది. ఈ ఎఫెక్ట్ చాణక్యపై గట్టిగా పడింది. సైరా చిత్రాన్ని రెండోసారి అయినా చూడటానికి ఇష్టపడ్డారే కానీ చాణక్య వైపు మాత్రం వెళ్ళలేదు ప్రేక్షకులు.

చాణక్య ఆరు రోజులకు తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్ల రూపాయల షేర్ సాధించి నిరాశపరిచింది. ప్రపంచవ్యాప్తంగా 3.9 కోట్ల రూపాయల షేర్, 6.6 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వసూలు చేయగలిగింది. చాణక్య ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు 12 కోట్లకు జరిగింది. అంటే దాదాపు 70 శాతాన్ని డిస్ట్రిబ్యూటర్లు నష్టపోనున్నారు. డిజాస్టర్ల మీద డిజాస్టర్లు కొడుతున్న గోపీచంద్ కెరీర్ ను ఎవరు కాపాడతారో ఏంటో.