సైరా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్Sye Raa Collections
Sye Raa Collections

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉన్నా కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రికార్డు వసూళ్లు సాధిస్తోంది. చాలా చోట్ల బాహుబలి 2 తప్పించి మిగతా అన్ని చిత్రాల రికార్డులను అధిగమిస్తోంది. తొలి వారంలో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 84 కోట్లు వసూలు చేసింది.

ఈ వారం, వచ్చే వారం పెద్ద సినిమాలేవీ లేని కారణంగా సైరాకు లాంగ్ రన్ ఉంటుందని ట్రేడ్ పండితులు అనుకుంటున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం 100 కోట్ల మైలురాయిని త్వరలో అధిగమించనుంది. సైరా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ ఇక్కడ చూడండి.

ప్రాంతం                    షేర్ (కోట్లలో)

నైజాం                           23.95

సీడెడ్                           15.10

నెల్లూరు                          3.90

కృష్ణ                              6.42

గుంటూరు                       8.45

వైజాగ్                          12.31

ఈస్ట్                             7.90

వెస్ట్                              5.75

మొదటి వారం తెలుగు రాష్ట్రాల మొత్తం    83.78*

* – నాన్ బాహుబలి 2 రికార్డు