రేసులో సైరా కంటే వెనకబడ్డ వార్


రేసులో సైరా కంటే వెనకబడ్డ వార్
రేసులో సైరా కంటే వెనకబడ్డ వార్

గాంధీ జయంతి సెలవు దినం రోజున సైరా నరసింహారెడ్డి, వార్ చిత్రాలు రిలీజై పోటీ పడ్డాయి. ఇందులో వార్.. బాలీవుడ్ స్టార్స్ హృతిక్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా కాగా, సైరా పీరియాడిక్ డ్రామా. ఈ రెండిటిలో సైరా నరసింహారెడ్డికి బాలీవుడ్ మీడియా పూర్తి పాజిటివ్ రేటింగ్ ఇచ్చింది.

దాదాపుగా అందరూ ఈ భారీ వార్ సీక్వెన్స్ లకు, ఎమోషనల్ కంటెంట్ కు ఫిదా అవుతున్నారు. హిందీ మీడియా వారు ఈ చిత్రానికి మంచి రేటింగ్స్ ఇచ్చారు. మరోవైపు వార్ కు మాత్రం బాలీవుడ్ మీడియా యావరేజ్ రేటింగులతో సరిపెట్టింది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ లు, ఛేజింగ్ ఎపిసోడ్స్ అదిరిపోయే వాటికి అదిరిపోయే కథనాన్ని జతచేయడంలో విఫలమయ్యారు.

ప్రస్తుతానికి అయితే సైరా, వార్ కంటే మంచి మార్కులు తెచ్చుకుంది. ప్రీ సేల్స్ బట్టి ఓపెనింగ్స్ కూడా సైరాకే ఎక్కువ వచ్చేలా కనిపిస్తోంది. మరి ఈ రెండిట్లో చివరికి ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.