సైరా లేటెస్ట్ యూఎస్ కలెక్షన్స్ రిపోర్ట్


సైరా లేటెస్ట్ యూఎస్ కలెక్షన్స్ రిపోర్ట్
సైరా లేటెస్ట్ యూఎస్ కలెక్షన్స్ రిపోర్ట్

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం సైరా నరసింహారెడ్డి అందరి అంచనాలకు మించి ఉండడంతో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం అన్ని సెంటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అటు ఇండియాలోనే కాకుండా యూఎస్ లో కూడా సైరా ప్రభావం చూపుతోంది.

మొదటి రెండు రోజులకు $1.1 మిలియన్ సాధించిన సైరా మూడో రోజుతో కలుపుకుని $1.48 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. దీంతో మొదటి మూడు రోజుల్లోనే $1.5 మిలియన్ డాలర్లకు చేరుకుంది సైరా. అయితే ఈ చిత్రం ఇంకా సగమే వసూలు చేసినట్లు. ఎందుకంటే సైరా యూఎస్ లో లాభాల్లోకి రావాలంటే దాదాపు 3 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాత. చిరంజీవితో పాటు తమన్నా, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి, అమితాబ్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాలలో కూడా సైరా మంచి కలెక్షన్స్ ను నమోదు చేస్తోంది. వర్కింగ్ డే అయినా కూడా సైరా కలెక్షన్స్ పై పెద్దగా ప్రభావం చూపించట్లేదు.