కర్ణాటక హక్కుల్లో సంచలనం సృష్టించిన సైరా


SyeRaa Narasimha Reddy
SyeRaa Narasimha Reddy

మెగాస్టార్ చిరంజీవి కి కర్ణాటకలో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే . కర్ణాటకలో తెలుగు , తమిళ చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది అయితే అందులో రజనీకాంత్ , చిరంజీవి చిత్రాలకు అనూహ్యమైన డిమాండ్ ఉంటుంది . కాగా తాజాగా సైరా నరసింహారెడ్డి బిజినెస్ పరంగా సంచలనం సృష్టించాడు చిరంజీవి . అత్యధికంగా ఈ చిత్రానికి 27 కోట్ల బిజినెస్ జరిగింది .

చిరంజీవి కున్న స్టామినా వల్ల ఈ స్థాయి బిజినెస్ జరిగింది . 27 కోట్ల కు సైరా కర్ణాటక హక్కులు పొందడంతో సంచలనమే అయ్యింది . ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2 న విడుదల కానుంది . చిరంజీవి , అమితాబ్ బచ్చన్ , జగపతిబాబు , సుదీప్ , విజయ్ సేతుపతి , నిహారిక , రవిశంకర్ , తమన్నా , నయనతార తదితరులు నటించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా రాంచరణ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించాడు .