ఓవర్సీస్ లో సైరా పరిస్థితేంటి?


Syeraa overseas Collections
Syeraa overseas Collections

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ పీరియాడిక్ డ్రామా సైరా నరసింహారెడ్డికి ప్రపంచవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో సైరా టీమ్ ఫుల్ ఖుషీ అయింది. అయితే ఆ ఆనందం సైరాకు ఎక్కువ కాలం నిలబడలేదు. ఎందుకంటే సరైన ప్రమోషన్స్ లేని కారణంగా హిందీలో సైరా డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది.

అంత మంచి టాక్ తెచ్చుకుని, బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు కూడా పెట్టుకుని సైరా ఆడకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే. మరోవైపు తమిళ్, మలయాళంలో సైతం సైరా ప్లాప్ దిశగా వెళ్తోంది. ఈ రెండు భాషల్లో అత్యల్ప కలెక్షన్లు నమోదవుతున్నాయి. మరో దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో పరిస్థితి కొంత మెరుగు. అలా అని అక్కడ అప్పుడే హిట్ అని చెప్పలేని పరిస్థితి.

ఇక ఓవర్సీస్ లో సైరా 2 మిలియన్ వసూళ్లను సాధించింది. ప్రీమియర్స్ తోనే దాదాపు 1 మిలియన్ సాధించిన సైరా, మరో మిలియన్ జత కావడానికి 5 రోజులు పట్టింది. సినిమా సేఫ్ అవ్వాలంటే మరో మిలియన్ కు పైగా రావాలి. 3 మిలియన్ దాటితే కానీ హిట్ అనలేం. మరి ఇప్పటికే కలెక్షన్లు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సైరా ఓవర్సీస్ లో నిలదొక్కుకుంటుందని ఆశించలేం. దీంతో ఒక్క తెలుగులో తప్ప ఎక్కడా సైరా హిట్ అయిందని అనలేం.