సైరా ప్రీ రిలీజ్ బిజినెస్ : మరో సాహో అవ్వదు కదా


Syeraa
సైరా ప్రీ రిలీజ్ బిజినెస్ : మరో సాహో అవ్వదు కదా

ఈ భారీ బడ్జెట్ చిత్రాలతో వచ్చిన ఇబ్బందే ఇది. బడ్జెట్ భారీగా పెట్టడంతో బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. ఎంత బిజినెస్ జరిగితే మార్కెట్ లో రిస్క్ ఫ్యాక్టర్ అంతలా పెరుగుతుంది. మొన్న విడుదలైన సాహో సినిమా విషయంలో జరిగింది అదే. నిజానికి సాహో భారీ కలెక్షన్లు సాధించింది. కానీ తెలుగులో ఈ చిత్రం ప్లాప్ ముద్ర వేయించుకుంది. ఎందుకంటే సాహో తెలుగులో 120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. టోటల్ రన్ లో 85 కోట్లు వసూలు చేసేలా ఉంది.

ఇప్పుడు సైరా కూడా ఇదే పంథాలో నడుస్తోంది. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 110 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే హిట్ అనిపించుకోవాలంటే సాహోను దాటి మరో 30 కోట్లు తేవాలి. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రాన్ని 18 కోట్లకు అమ్మారు. మిగిలిన ఏరియాల్లో కూడా భారీ మొత్తాలకు అమ్మేలా అగ్రీమెంట్లు నడుస్తున్నాయి. ఈ రేట్లు అన్నీ చూస్తుంటే సైరా నరసింహారెడ్డి హిట్ స్టేటస్ పొందాలంటే రికార్డులను తిరగరాయాల్సిందే. మరి మెగాస్టార్ ఆ అద్భుతాన్ని అందుకోగలడా అన్నది చూడాలి.