సాలిడ్ గా కొనసాగుతున్న సైరా


syeraa solid in telugu states
syeraa solid in telugu states

మిగతా ప్రాంతాల సంగతి ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సైరా నరసింహారెడ్డి స్థిరమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్ర వారం రోజుల రన్ పూర్తయింది. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 తర్వాత ఫస్ట్ వీక్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సైరా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు వసూలు చేసిన సైరా, రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుండే 100 కోట్లు సాధించవచ్చు.

సాహో సాధించిన వసూళ్ళని వారం రోజుల్లోనే అధిగమించిన సైరా, మరిన్ని రికార్డులపై కన్నేసింది. రెండవ వారంలో పోటీనిచ్చే సినిమా ఏదీ సైరాకు లేదు. అలాగే భారీ చిత్రాలేవీ ఈ నెలలో విడుదలయ్యే అవకాశాలు లేవు. దీంతో సైరాకు లాంగ్ రన్ ఉంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.

తెలుగు వెర్షన్ వరకూ సైరాకు ఎదురులేదు. నాన్ బాహుబలి రికార్డును తన ఖాతాలో వేసుకోవడం ఖాయం. చిక్కల్లా మిగతా ప్రాంతాల నుండే వస్తోంది. ఓవర్సీస్, కర్ణాటకలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా మలయాళం, తమిళ్, హిందీలో సైరాకు దారుణ పరాభవం తప్పేలా లేదు. ఏదేమైనా సైరా నరసింహారెడ్డి ద్వారా చిరంజీవి తన చరిష్మా ఇంకా అలాగే ఉందని మరోసారి నిరూపించాడు.