వామ్మో సైరా స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం అంత పెట్టారా?


Sye Raa Narasimha Reddy
వామ్మో సైరా స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం అంత పెట్టారా?

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా సైరా నరసింహారెడ్డిని తీసుకున్నారు. అందుకే ఈ చిత్రం కోసం ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించారు. నిర్మాత కూడా కొడుకు రామ్ చరణ్ కావడంతో బడ్జెట్ విషయంలో మరింత సౌలభ్యం లభించింది. దాదాపు 200 కోట్లకు పైన బడ్జెట్ తో తెరకెక్కిన సైరాలో స్పెషల్ ఎఫెక్ట్స్ కు కూడా సముచిత స్థానం ఉందన్న విషయం తెల్సిందే.

అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 18న భారీ ఎత్తున చేయనున్నారు. ఇదిలా ఉంచితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర స్పెషల్ ఎఫెక్ట్స్ కోసమే దాదాపు 45 కోట్ల వరకూ వెచ్చించారట. సైరా ఒక పీరియడ్ డ్రామా కావడంతో స్పెషల్ ఎఫెక్ట్స్ తో ఎక్కువ అవసరం పడింది. పోరాట సన్నివేశాలు కూడా అధికంగా ఉన్నాయి. అందుకే క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా సురేందర్ రెడ్డి అండ్ కో జాగ్రత్తలు తీసుకోవడంతో ఇంత బడ్జెట్ అయిందని తెలుస్తోంది.

తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైరా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. అక్టోబర్ 18న ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా సైరా టీమ్ పర్యటించి ప్రమోషన్లను గట్టిగా చేయనున్నారు.