సైరాకు వరంలా మారిన ఆర్టీసీ స్ట్రైక్

Sye Raa
Sye Raa

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ స్ట్రైక్ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో, విద్యార్థులకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో దసరా సెలవులను ఈ నెల 19 వరకూ పొగిడిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. అంటే తిరిగి 21వ తారీఖున స్కూళ్ళు తెరుచుకుంటాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రానికి ఇది వరం లాంటిదేనని చెప్పొచ్చు.

సైరా చిత్రం దసరా సెలవుల అడ్వాంటేజ్ ను ఫుల్లుగా ఉపయోగించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన సెలవులతో పాటు సైరాకు టాక్ కూడా బాగుండడంతో కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 100 కోట్ల షేర్ కు చేరుకుంది సైరా. అయితే రేపటితో సెలవులు అయిపోనుండడంతో సైరా కలెక్షన్స్ కు భారీగా గండి పడుతుందని భావించారు.

ఇక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరో వారం రోజులు నైజాంలో సైరాకు ఎదురే లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పాఠశాలలు యధావిధిగా తెరుచుకోనున్నాయి. ఏదేమైనా అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని సైరా బృందం ఎంతవరకూ క్యాష్ చేసుకుంటుందో చూడాలి.