సైరా ప్రమోషన్ షెడ్యూల్ ఖరారు


సైరా ప్రమోషన్ షెడ్యూల్ ఖరారు
సైరా ప్రమోషన్ షెడ్యూల్ ఖరారు ( Image Courtsey: SyeRaaNarasimhaReddy )

సాహో వసూళ్లు నెమ్మదించడంతో ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టాంతా సైరా నరసింహారెడ్డిపై పడింది. సాహో తర్వాత వస్తున్న భారీ చిత్రం కావడంతో తెలుగుతో పాటు మిగతా ఇండస్ట్రీల చూపు కూడా దీనిపై ఉంది. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. విడుదలకు ఇంకా నెల రోజులు కూడా లేకపోవడంతో సైరా టీమ్ త్వరలో ప్రమోషన్స్ షురూ చేయనుంది.

సెప్టెంబర్ 10 నుండి ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ మొదలుకానున్నాయి. మరోవైపు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సొంత ప్రాంతమైన కర్నూల్ లో ఈ చిత్ర ఈవెంట్ ను ప్లాన్ చేసారు నిర్మాతలు. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు మిగిలిన మెగా హీరోలు కూడా గెస్ట్ లుగా విచ్చేయనున్నారు.

మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదలవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరో ఈవెంట్ హైదరాబాద్ లో చేయనున్నారు. దీనికి అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్ తదితర అగ్రతారాగణమంతా విచ్చేయనున్నారు. మొత్తానికి విడుదలకు ముందు వీలైనంత హైప్ తీసుకురావడానికి చిత్ర యూనిట్ చూస్తోంది.