కోడలుగా హీరోయిన్ వద్దంటున్న శింబు నాన్న


ప్రేమించడానికి , జల్సా లు చేయడానికి హీరోయిన్ లు కావాలట కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం హీరోయిన్ లు వద్దని అంటున్నాడు హీరో శింబు నాన్న దర్శకుడు , నటుడు టి . రాజేందర్ . తమిళ హీరో శింబు ప్లే బాయ్ గా పలువురు హీరోయిన్ లను ప్రేమిస్తూ పెళ్లి వరకు వెళ్లి పెటాకులు అయిన విషయం తెలిసిందే . నయనతార తో ఇక పెళ్లి కావడమే తరువాయి అనుకున్నారు కట్ చేస్తే ఆ పెళ్లి ఆగిపోయింది .

ఆ తర్వాత హన్సిక తో కూడా ఘాటు ప్రేమాయణం సాగించాడు శింబు , హన్సిక తో కూడా పెళ్లి కావడమే తరువాయి అని అనుకున్నారు అది కూడా క్యాన్సిల్ అయ్యింది . దాంతోనో లేక మరో కారణమో కానీ శింబు కి మంచి అమ్మాయి దొరకాలని , హీరోయిన్ ని మాత్రం పెళ్లి చేసుకుంటే ఒప్పుకోనని అంటున్నాడు రాజేందర్ . తప్పు మొత్తం హీరోయిన్ ల మీద నెట్టేస్తున్నాడు రాజేందర్ …. ఎంతైనా కొడుకు కదా !