తాప్సీ ఒప్పుకుంటుందా ?


Taapsee Pannu
Taapsee Pannu

రాజుగారి గది 3 లో తమన్నా తప్పుకోవడంతో దర్శకులు ఓంకార్ తాప్సీ ని సంప్రదించాడట . విభిన్న కథా చిత్రాలతో బాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తున్న ఈ భామ తాజాగా గేమ్ ఓవర్ అనే విభిన్న కథా చిత్రంతో ప్రేక్షకులను అలరించింది . హర్రర్ నేపథ్యంలో కూడా తాప్సీ పలు చిత్రాల్లో నటించింది కాబట్టి తమన్నా ని రీప్లేస్ చేసేది తాప్సీ నే అని ఫిక్స్ అయ్యాడట ఓంకార్ .

 

ఆమేరకు తాప్సీ ని కలిసి కథ చెప్పాడట కూడా . అయితే తాప్సీ ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు . ఒకవేళ తాప్సీ ఒప్పుకుంటే ఓంకార్ పంట పండినట్లే ఎందుకంటే ఇప్పుడు తాప్సీ కి తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువగా మార్కెట్ ఉంది కాబట్టి . రాజుగారి గది సక్సెస్ కావడంతో రాజుగారి గది 2 తీసాడు ఇపుడేమో రాజుగారి గది 3 కి రెడీ అయ్యాడు ఓంకార్ .