ఢిల్లీ భామ తాప్సి జోరు మామూలుగాలేదుగా….


Taapsee Pannu
ఢిల్లీ భామ తాప్సి జోరు మామూలుగాలేదుగా….

తెలుగులో మొదట “జుమ్మంది నాదం” అని దర్శకేంద్రుడు “కె. రాఘవేంద్ర రావు” సినిమాలో నటించింది. దర్శకేంద్రుడు అంటేనే నాభి అందం, అభినయం వాటి మీద ఫోకస్ పెట్టె సినిమాలు. అందులో “తాప్సి పన్ను” కూడా ఏం తక్కువ కాకుండా దర్శకుడు చెప్పినట్టు నటన పరంగా, అభినయ పరంగా బాగా నటించింది. సినిమా ఆడకపోయిన కూడా సినిమాలో అందానికి, చిలిపి నటనకి మంచి మార్కులు పడ్డాయి.

ఇక అప్పటినుండి సినిమాలు చకచకా చేసుకుంటూ వెళ్ళింది. చేసిన అన్నింటిలో ఎక్కువగా ఫ్లాప్ లు తెలుగు సినిమాలోనే ఉన్నాయి అని తెలిసి తెలుగు నుండి బాలీవుడ్ ప్రపంచానికి వెళ్ళింది. అక్కడ అయితే అమ్మడికి అదృష్టం బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి, చేసిన ప్రతి సినిమాలు బాగా పేరు తెచ్చి పెట్టాయి అటు నటన పరంగా, ఇటు అభినయ పరంగా.

ఇక మళ్ళి తెలుగుకి వచ్చి “ఆనందో బ్రహ్మ” , “ఘాజి” ఈ సంవత్సరం “గేమ్ ఓవర్” అని చేసింది. అవి బాగా ప్రేక్షక ఆదరణ పొందాయి. తెలుగు మీద ఎక్కువ ఫోకస్ పెట్టని తాప్సి కి బాలీవుడ్ నుండి తెగ ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్ లోనే హిట్ % బాగా కలిసి వచ్చింది ఢిల్లీ పాపకి.

అయితే ఈ రోజు తాను నటించిన బాలీవుడ్ సినిమా “సాండ్ కి ఆంఖ్” ట్రైలర్ రిలీజ్ అయ్యింది, ట్రైలర్ చూడటానికి చాలా బాగుంది. తాప్సి రోల్ కూడా భలే విచిత్రంగా ఉంది. ఈ సినిమాకి “తుషార్ హిరానందని” దర్శకత్వం చేస్తున్నారు. ఇది ఆడవారి లేబర్ (కూలీ) పని గురించి సాగే కథ, అలాంటి అమ్మలకి ఈ సినిమా అంకితం అని తాప్సి గారు అంటున్నారు.

ఇప్పటికే బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న తాప్సికి ఇక ముందు కూడా ఇలాంటి ఛాలెంజ్ రోల్స్ మాత్రమే చేయడం ఇష్టం అంటుంది. అందానికి, అభినయానికి తర్వాత ప్రాధాన్యత అంటుంది ఢిల్లీ భామ.