తాప్సీ క‌ల నెర‌వేరుతోంది!

తాప్సీ క‌ల నెర‌వేరుతోంది!
తాప్సీ క‌ల నెర‌వేరుతోంది!

టాలీవుడ్ నుంచి ముంబైకి మ‌కాం మార్చిన తాప్సీ వ‌రుప హిందీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. వ‌రుప‌గా విభిన్న‌మైన చిత్రాల్లో న‌టిస్తూ ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంటోంది. `పింక్‌`, `బ‌ద్లా` వంటి చిత్రాల‌తో బాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. న‌టిగా బిజీగా వున్న తాప్సీ గత ఏడాది ముంబైలోని అంధేరిలో 3 బిహెచ్‌కె ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ఇంటి లోపలి భాగం ఆమె అభిరుచికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయిస్తోంది.

ఇప్పుడు ఇంటీరియర్ పనులు పూర్తయ్యాయి. తాప్సీ తన సోదరి షాగున్‌తో కలిసి ఈ దీపావళికి తన కొత్త ఇంటికి వెళ్లబోతోంది. తాప్సీ ఇంటికి వెళ్ళే ముందు కొత్త ఇంటి వద్ద ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించాలని యోచిస్తోంది. ఇందు కోసం గృహ ప్ర‌వేశానికి సంబంధించిన ఏర్పాట్ల‌ని చేస్తోంది.

కాస్ట్‌లీ కార్‌ని ఖ‌రీదు చేసిన తాప్సీ సొంత ఇంటి క‌ల‌ని నిజం చేసుకోవాల‌ని గ‌త కొంత కాలంగా క‌ల‌లు కంటోంది. తాజాగా ఆ క‌ల‌ని నిజం చేసుకుంటోంది. ప్రస్తుతం ఉంటున్న ఫ్లాట్ పైనే సొంత‌ ఇల్లు కొన్నారు. ఈ దీపావ‌ళికి సొంత  ఇంటిలోకి వెళ్ల‌బోతుండ‌టంతో తాప్సీ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయ‌ట‌. తాప్సీ ప్ర‌స్తుతం రష్మి రాకెట్, లూప్ లాపెటా, జ‌న గ‌ణ మ‌న చిత్రాల్లో న‌టిస్తోంది.