ఎట్ట‌కేల‌కు ఐటీ రైడ్స్‌పై తాప్సీ కౌంట‌ర్‌!

ఎట్ట‌కేల‌కు ఐటీ రైడ్స్‌పై తాప్సీ కౌంట‌ర్‌!
ఎట్ట‌కేల‌కు ఐటీ రైడ్స్‌పై తాప్సీ కౌంట‌ర్‌!

ఈ వారం ప్రారంభంలో ముంబైలోని తా‌ప్సీ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయడంతో వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. దాదాపు 650 కోట్ల రూపాయలు తారుమార‌య్యాయ‌ని ఈ సంద‌ర్భంగా ఐటి శాఖ పేర్కొంది. ఐటి దాడులపై స్పందించడానికి తాప్సీ మీడియా ముందు రాలేదు. కాని ఆమె తాజాగా తన ట్విట్టర్ హ్యాండిల్ ద‌వ్వారా ఐటీ దాడుల‌పై కౌంట‌ర్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది.  వ్యంగ్యంగా ట్వీట్ చేయ‌డం ప్ర‌స్తుతం చర్చ‌నీయాంశంగా మారింది.

ప్రధానంగా 3 విషయాలను 3 రోజుల తీవ్రమైన శోధన అంటూ ట్వీట్ చేసిన తాప్సీ `పారిస్‌లో నేను స్పష్టంగా కలిగి ఉన్నాన‌ని ఆరోపించిన బంగ్లా తాలూకు కీస్. దీన్నే ఎందుకు చెబుతున్నారంటే వేసవి సెలవుల కోసం నేను పారిస్ వెళుతున్నాన‌ని. రెండ‌వ‌ది ఐదె కోట్ల‌కు సంబంధించిన రిసిప్ట్‌. దాన్ని నేను అంత‌కు ముందే రిజెక్ట్ చేశాను. ఇక 3వ‌ది 2013లో కూడా నాపై ఐటీ దాడులు జ‌రిగాయ‌ని గౌరవనీయ ఆర్థిక మంత్రి గుర్తు చేస్తున్నారు. ఇక పై ఇంత శాస్తి ఇంకెప్పుడూ జ‌ర‌గ‌దు` అని వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.

తాప్సీ వ్యంగ్యాస్త్రాల‌ని బ‌ట్టి తాను ఎటువంటి పన్ను ఎగవేతలో పాల్గొనలేదని స్పష్టం చేసింది. కానీ ఐటీ శాఖ మాత్రం మ‌రో వాద‌న వినిపిస్తోంది. ఇందులో నిజ‌మెంత‌న్న‌ది తెలియాలంటే అస‌లు నిజం బ‌య‌టికి వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.