తాప్సీ చెంప ఛెల్లుమ‌నిపించిందెవ‌రు?

Taapsi Thappad movie first look
Taapsi Thappad movie first look

తెలుగులో క‌మ‌ర్షియ‌ల్ క‌థానాయిక‌గా న‌టించ‌డం ఇష్టంలేని తాప్సీ బాలీవుడ్ బాట ప‌ట్టింది. అక్క‌డ యాక్ష‌న్ చిత్రాల్లో న‌టిస్తూ త‌న‌దైన గుర్తింపును సొంతం చేసుకుంది. `బేబీ`,  పింక్‌, నామ్ ష‌బానా, ముల్క్‌, మ‌న్‌మ‌ర్జియా, బ‌ద్లా, గేమ్ ఓవ‌ర్‌, మిష‌న్ మంగ‌ల్‌, సాండ్ కీ ఆంఖ్ వంటి విభిన్నచిత్రాల్లో న‌టించింది. తాజాగా మ‌రో వెరైటీ సినిమాతో, వెరైటీ టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఆ సినిమానే `థ‌ప్ప‌డ్‌` `చెంప‌దెబ్బ‌`. టైటిలే షాకింగ్ వుంటే ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ మ‌రింత షాకింగ్ గా వుంది. తాప్సీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని అనుభ‌వ్ సిన్హా రూపొందిస్తుండ‌గా, ఆయ‌న‌తో క‌లిసి టీ సిరీస్ అధినేత భూష‌ణ్‌కుమార్ నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని తాప్సీ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంది.

ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లో ఎవ‌రో తాప్సీ చెంప ఛెల్లుమ‌నిపించిన‌ట్టుగా క‌నిపిస్తోంది. సినిమా టైటిల్ కూడా అదే కావ‌డంతో కంటెంట్‌కి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌గా సూట‌యింద‌ని నెటిజ‌న్స్ సెటైర్లు వేస్తున్నారు. వైరైటీ టైటిల్‌తో వ‌స్తున్న ఈ సినిమాకు న‌లుగురు క్రేజీ సంగీత ద‌ర్శ‌కులు సంగీతం అందిస్తున్నారు. `సైరట్‌` ఫేమ్ అజ‌య్ – అతుల్ వుండ‌టంతో సినిమా సంగీతం ఓ రేంజ్‌లో వుంటుంద‌ని చెబుతున్నారు.