నితిన్ సినిమాపై సస్పెన్స్ అలానే కంటిన్యూ అవుతోందిగా!


నితిన్ సినిమాపై సస్పెన్స్ అలానే కంటిన్యూ అవుతోందిగా!
నితిన్ సినిమాపై సస్పెన్స్ అలానే కంటిన్యూ అవుతోందిగా!

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం తన హనీమూన్ పీరియడ్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెల్సిందే. షాలినితో ఇటీవలే నితిన్ కు పెళ్ళైన విషయం కూడా తెల్సిందే. ప్రస్తుతం నితిన్ చేతిలో చాలా సినిమాలున్నాయి. ఈ ఏడాది భీష్మ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్నాడు నితిన్. వరస ప్లాపుల తర్వాత నితిన్ కు ఇది ఊపును ఇచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం నితిన్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. కీర్తి సురేష్ సరసన వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్ దే, అలాగే చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చెక్. ఈ రెండు సినిమాల షూటింగులకు ఇప్పుడు కరోనా కారణంగా బ్రేకులు పడ్డాయి. త్వరలోనే ఈ రెండు సినిమాలు తిరిగి పట్టాలెక్కనున్నాయి.

ఇక ఈ రెండూ కాకుండా నితిన్ బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం అంధధూన్ రీమేక్ విషయంలో ఆసక్తిగా ఉన్నాడు. తన సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్ ఈ రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ తెరకెక్కించనుండగా హీరోయిన్ పాత్రకు నభా నటేష్ ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. ఇక దానికంటే ముఖ్యమైన టబు పాత్రకు ఇంకా ఎవరిని తీసుకున్నారు అనే విషయంలో క్లారిటీ లేదు. రంభ లేదా శ్రియలలో ఒకరు ఫైనల్ అయ్యేలా ఉన్నారు. మరి ఈ సస్పెన్స్ ఎప్పటికి విడిపోతుందో.