రొమ్ము క్యాన్సర్ ని జయించిన హీరో భార్య


Tahira kashyap posts powerful pic her surgery

రొమ్ము క్యాన్సర్ తో బాధపడిన బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య ఎట్టకేలకు ఆ క్యాన్సర్ ని జయించింది . దాంతో  క్యాన్సర్ డే సందర్భాన్ని పురస్కరించుకొని తన ఒంటి పై ఉన్న కత్తి గాటుని చూపిస్తూ దీన్ని గౌరవ చిహ్నం గా భావిస్తున్నాను అంటూ పోస్ట్ చేసింది ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ . రొమ్ము క్యాన్సర్ తో పోరాడిన తహీరా ఎట్టకేలకు ఆపరేషన్ చేయించుకొని క్యాన్సర్ ని ఇప్పటికైతే జయించింది .

 

అందుకే వీపు భాగాన్ని మొత్తం చూపిస్తూ , ఆ వీపుపై ఉన్న కత్తి గాట్లని కూడా కనిపించేలా ఫోటో దిగి వాటిని ట్వీట్ చేసింది . అంతేకాదు క్యాన్సర్ ని తొలిదశలోనే గుర్తించాలని , మనోధైర్యంతో ఎదుర్కోవాలని చెబుతోంది తహీరా కశ్యప్ . హీరో గారి భార్య చేసిన ట్వీట్ కి నెటిజన్ల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది .

 

English Title: Tahira kashyap posts powerful pic her surgery