ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ ఆక‌ట్టుకుంటోంది!


ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ ఆక‌ట్టుకుంటోంది!
ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ ఆక‌ట్టుకుంటోంది!

`భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ` చిత్ర బృందంపై సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ ప్ర‌శంస‌లు కురిపించారు. న‌వీన్ చంద్ర హీరోగా న‌టించిన ఈ చిత్రం ఈ శుక్ర‌వారం `ఆహా` ఓటీటీలో విడుద‌లైంది. శ్రీ‌కాంత్ నాగోతి ద‌ర్శ‌కుడు. స‌లోని లూథ్రా హీరోయిన్‌. నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై శ‌ర‌త్ మ‌రార్ స‌మ‌ర్ప‌ణ‌లో క్రిషివ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత యశ్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రంపై స‌ర్వ‌త్రా పాజిటివ్ టాక్ వినిపిస్తున్న నేప‌థ్యంలో చిత్ర బృందం శుక్ర‌వారం సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ ని ప్ర‌త్యేకంగా క‌లిసింది. ఈ సంద‌ర్భంగా సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ మాట్లాడుతూ చిత్ర బృందంపై ప్ర‌శంస‌లు కురిపించారు. క‌రోనా స్వైర విహారం చేస్తున్న ఈ ప్ర‌తికూల స‌మ‌యంలోనూ ఈ చిత్రం ఆక‌ట్టుకుంటోంద‌ని మేక‌ర్స్‌ని అభినందించారు.

న‌వీన్‌చంద్ర హీరోగా యంగ్ టీమ్ చేసిన ప్ర‌య‌త్నం ఇద‌ని, ఓ మంచి చిత్రాన్ని అందించిన ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ నాగోతి, నిర్మాత య‌శ్వంత్ ములుకుట్ల‌, స‌మ‌ర్ప‌కుడు శ‌ర‌త్ మ‌రార్‌ని ప్ర‌త్యేకంగా అభినందించారు. అల్లు అర‌వింద్‌కు సంబంధించిన ఓటీటీ ప్లాట్ ఫాం `ఆహా`లో ఈ చిత్రం విడుద‌లైంద‌ని, మంచి ఆర‌ద‌ణ పొందుతోంద‌న్నారు. క‌రోనా కార‌ణంగా చిత్ర ప‌రిశ్ర‌మ ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంద‌ని, ఈ నేప‌థ్యంలో విడుద‌ల‌కు సిద్ధ‌మైన చిత్రాలు ఓటీటీల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయ‌ని. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో ఓటీటీ ద్వారా విడుద‌లైన `భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ‌` చిత్రాన్ని ప్రేక్ష‌కులు త‌ప్ప‌క ఆద‌రించాల‌ని త‌ల‌సాని కోరారు.