చంద్రబాబు పిరికిపంద : తలసాని శ్రీనివాస యాదవ్


Talasani srinivas yadav sensational comments again on chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిరికిపంద అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస యాదవ్ . గతకొంత కాలంగా చంద్రబాబుని దారుణంగా టార్గెట్ చేస్తున్నాడు మంత్రి తలసాని . తెలుగుదేశం ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసాడు తలసాని . అయితే అదే చంద్రబాబు ని ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాడు .

 

ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు నెలల్లో చంద్రబాబు అధికారం కోల్పోయి జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని , పనికి మాలిన పథకాలు అన్నీ పెట్టి పరువు తీసుకుంటున్నాడని , ధర్మ పోరాట దీక్షలు అంటూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాడని …… సీమాంధ్రులను తెలంగాణలో కడుపులో పెట్టి చూసుకుంటున్న కేసీఆర్ ని చంద్రబాబు విమర్శిస్తాడా ? అంటూ నిప్పులు కక్కడమే కాకుండా ఓటుకి నోటు కేసులో భయపడి తెలంగాణ నుండి పారిపోయిన పిరికిపంద చంద్రబాబు అని తీవ్ర స్థాయిలో విమర్శించాడు తలసాని .

English Title: Talasani srinivas yadav sensational comments again on chandrababu