టాక్ ఓకే మ‌రి క‌లెక్ష‌న్‌ల మాటేంటీ?

Talk ok but colletions not ok for Sreekaram
Talk ok but colletions not ok for Sreekaram

గత కొన్నేళ్లుగా హీరో శర్వానంద్‌కు ఏమీ క‌లిసి రావ‌డం లేదు. ఎంత మంది క‌థ‌తో సినిమా చేసినా అది  సరిగ్గా ఆడ‌టం లేదు. పడి పడి లేచే మనసు, రణరంగం ఆ త‌రువాత వ‌చ్చిన `జాను`.. ఇలా వ‌రుస‌ల వైఫల్యాలతో శర్వానంద్ స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఇదిలా వుంటే ఆయ‌న ట‌నించిన కొత్త చిత్రం `శ్రీకారం`తో విజయాల బాట ప‌ట్టాల‌ని ప్లాన్ చేశాడు.

అయితే త‌నొక‌టి త‌లిస్తే విధి మ‌రోటి త‌ల‌చింది అన్న‌ట్టుగా అర్థ‌వంత‌మైన క‌థ‌తో `శ్రీకారం` చిత్రాన్ని చేసినా టాక్‌కి , సినిమా క‌లెక్ష‌న్‌ల‌కి సంబంధం లేకుండా పోయింది. ప్ర‌ముఖులు ఈ మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించినా ఫ‌లితం మాత్రం ఏమంత ఆశాజ‌న‌కంగా లేదు.  ఎంత మంచి టాక్ వున్నా `శ్రీకారం` బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది.

మార్చి 11 న`శ్రీకారం` ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ముందు పాజిటివ్ టాక్ వినిపించినా `జాతిరత్నాలు` రిలీజ్ త‌రువాత ఈ మూవీ ఫేట్ మారిపోయింది. ఈ సినిమా త‌రువాత `శ్రీ‌కారం` గురించి మాట్లాడుకున్న వాళ్లు లేరంటే ఈ సినిమా `శ్రీ‌కారం`ని ఏ స్థాయిలో షాడో చేసిందో అర్థం చేసుకోవ‌చ్చు. నిర్మాత‌లు సేఫ్ జోన్‌లోనే వున్నా డిస్ట్రిబ్యూట‌ర్స్ సేఫ్ జోన్‌లోకి రావాల్సి వుంది.