బ్యాక్ చూపించి గుబులు రేపుతున్న తమన్నా


Tamanna Bhatia
బ్యాక్ చూపించి గుబులు రేపుతున్న తమన్నా

ఇండస్ట్రీకొచ్చి దశాబ్దంన్నర గడుస్తున్నా మిల్కీ బ్యూటీ తమన్నా ఇంకా లైమ్ లైట్ లోనే కొనసాగుతోంది. తమన్నా పని అయిపోయిందన్న ప్రతీసారీ ఒక పెద్ద హిట్ కొట్టి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. ఈ ఏడాది మొదట్లో ఎఫ్ 2 సినిమాతో రీసౌండింగ్ హిట్ అందుకుంది. అలాగే సైరాలో ఒక ప్రముఖ పాత్రలో కనిపించనుంది. ఇంకా పలు ఆఫర్లు చేతిలో ఉన్నాయి.

ఇదిలా ఉంటే తమన్నా గ్లామర్ మొదటినుండీ భలే మైంటైన్ చేస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందీ భామ. రీసెంట్ గా తమన్నా ఇన్స్టాలో తన బ్యాక్ ను ఎక్స్పోజ్ చేస్తూ పెట్టిన ఒక ఫోటో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అమ్మడి నడుమే ఆమెకు స్పెషల్ అట్రాక్షన్ కాబట్టి దాంతోనే ఇప్పటికే యువకుల హృదయాలకు గాలం వేస్తోంది.

ఫొటోతో పాటు “అమెరికా రెడీనా?” అంటూ ఒక క్యాప్షన్ కూడా జత చేసింది. తమన్నా రంగ్ అనే పేరుతో అమెరికాలో డ్యాన్స్ టూర్ కు రెడీ అవుతోంది. దానికి సంబంధించిన రిహార్సల్స్ పిక్ నే పోస్ట్ చేసింది. అదీ విషయం.

 

View this post on Instagram

 

America, are you ready???? #RRANG #SatrangiSchoolOfFusion #KishVarieth #RohitBaxi # BollywoodFusion

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on

Credit: Instagram