తమన్నా ఇప్పటికీ హాట్ ఫేవరెట్


Tamannah Bhatia
తమన్నా ఇప్పటికీ హాట్ ఫేవరెట్

సాధారణంగా హీరోయిన్స్ కెరీర్ స్పాన్ హీరోలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. మహా అయితే ఐదేళ్లు, కాదంటే పదేళ్లు. కానీ దశాబ్దన్నర అవుతున్నా కూడా హీరోయిన్ గా ఇంకా అవకాశాలు అందిపుచ్చుకుంటూ యువ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది తమన్నా గురించి.

2005లో శ్రీ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తమన్నా, 2007లో విడుదలైన హ్యాపీ డేస్ తో తెలుగులో మొదటి విజయాన్ని అందుకుంది. ఆపై క్రమక్రమంగా ఎదుగుతూ తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అనిపించుకుంది. ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లు అందరి సరసనా నటించేసిన తమన్నా దశాబ్దన్నర కావోస్తోన్నా ఇంకా క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకోగలుగుతోంది.

బాహుబలి లాంటి మెగా ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన తమన్నా, ఈ ఏడాది ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే చిరంజీవి సరసన సైరా వంటి భారీ ప్రాజెక్టులో భాగమైంది. తమిళ్ స్టార్ హీరో సరసన యాక్షన్ సినిమాలో నటిస్తోంది. గోపీచంద్ – సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. మొత్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో కలిపి 7 చిత్రాల్లో నటిస్తోంది తమన్నా.