సైరాలో తమన్నా రోల్ పెద్దదే


Tamannah Bhatia
సైరాలో తమన్నా రోల్ పెద్దదే

మొదట సైరా నరసింహారెడ్డిలో తమన్నాను ఎంపిక చేసారని వార్తలు రాగానే చాలామంది ఇందులో ఆమెది చాలా చిన్న పాత్ర అనుకున్నారు. ఏవో నాలుగు డైలాగులు ఉండి, ఒక పాట కోసం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. అయితే ఇటీవలే విడుదలైన ట్రైలర్ లో ఆమెకు తగిన గుర్తింపే ఉంది. చిరంజీవితో సీన్లు బానే ఉన్నట్లు అనిపిస్తోంది. పైగా పోరాట దృశ్యాల్లో కూడా ఆమె ఉంది. ఇందులో ఆమె నృత్య కళాకారిణి పాత్ర చేస్తోంది.

వీటన్నిటి బట్టి చూస్తే తమన్నాకు సైరాలో ప్రాధాన్యమున్న పాత్రే లభించినట్లు తెలుస్తోంది. ఒకవేళ సైరా కనుక సూపర్ హిట్ అయితే తమన్నాకు అది చాలా ప్లస్ అవుతుందని స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదు భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం ద్వారా అన్ని ఇండస్ట్రీలలో ఆమె గుర్తింపు పొందవచ్చు. పైగా హిందీలో తమన్నా స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది. బాలీవుడ్ లో ఆమె కెరీర్ మళ్ళీ ఊపందుకోవాలంటే సైరా సరైన మార్గం. చూద్దాం మరి ఏం జరుగుతుందో.