త‌మ‌న్నా తెలంగాణ పాఠాలు!


త‌మ‌న్నా తెలంగాణ పాఠాలు!
త‌మ‌న్నా తెలంగాణ పాఠాలు!

తెలంగాణ యాస అప్ప‌ట్లో విజ‌య‌శాంతికి మంచి గుర్తింపుతో పాటు నంది పుర‌స్కారాన్ని కూడా అందించింది. అదే యాస‌తో తొలి చిత్రంతోనే మ్యాజిక్ చేసింది సాయి ప‌ల్ల‌వి. ఆమె న‌టించిన `ఫిదా` చిత్రంలో భానుమ‌తి హైబ్రీడ్ పిల్ల అంటూ ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేసిన విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత చాలా మంది ప్ర‌య‌త్నించినా అంత‌గా రాణించ‌లేక‌పోయారు.

ఇప్పుడు ఇదే స్లాంగ్‌ని త‌మ‌న్నా ట్రై చేస్తోంది. ఆమె న‌టిస్తున్న తాజా చిత్రం `సీటీమార్‌`. గోపీచంద్ హీరోగా న‌టిస్తున్నారు. సంప‌త్‌నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా క‌బ‌డ్డీ కోచ్‌గా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు జ్వాలారెడ్డి. తెలంగాణ యాస‌లో ఆమె స్లాంగ్ వుంటుంద‌ట‌. ఈ భాషపై ప‌ట్టు సాధించ‌డం కోసం త‌మ‌న్నా భారీ క‌స‌ర‌త్తులే చేస్తోంది.

ప్ర‌త్యేకంగా క‌బ‌డ్డీ కూడా నేర్చుకున్న త‌మ‌న్నా ఈ పాత్ర కోసం చాలానే హార్డ్‌ వ‌ర్క్ చేసింద‌ట‌. ఇంత‌కుముందెన్న‌డూ ఆడ‌ని క‌బ‌డ్డీ ఆట నేర్చుకున్నాన‌ని, చాలా వ‌ర‌కు ఈ పాత్ర‌లో లీనం కావ‌డానికి నా వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని, అయితే తెలంగాణ యాస‌ని ప‌ట్టుకోవ‌డం కొంత ఇబ్బందిగా మారింద‌ని చెబుతోంది. అయితే ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది తెలంగాణ‌కు చెందిన వ్య‌క్తే కావ‌డంతో ఆయ‌న ఇచ్చిన స‌ల‌హాల‌తో భాష‌పై ప‌ట్టు సాధిస్తున్నాన‌ని త‌మ‌న్నా వెల్ల‌డించింది.