ప్లాప్ హీరో సరసన మిల్కీ బ్యూటీ?Tamannaah
Tamannaah

యాక్షన్ హీరోగా పేరు సంపాదించినా గోపీచంద్ ఈ మధ్య కాలంలో హిట్లు లేక బాగా ఇబ్బంది పడుతున్నాడు. సినిమాలు ప్లాప్ అవుతున్నా గోపీచంద్ సినిమాలకు మాత్రం కొదవ లేదు. ఇప్పటికే గోపీచంద్ స్పై పాత్రలో నటించిన థ్రిల్లర్ చాణక్య సైరాతో పోటీ పడుతూ అక్టోబర్ 5న విడుదల కానుంది. దీని తర్వాత సంపత్ నంది దర్శకత్వం వహించే సినిమాలో నటించబోతున్నాడు గోపీచంద్.

యూ టర్న్ చిత్రాన్ని నిర్మించిన శ్రీనివాస్ చిత్తూరి ఈ సినిమాకి నిర్మాత. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నాను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సైరాలో ఒక కీలక పాత్రలో కనిపించిన తమన్నాకు డిమాండ్ బానేఉంది. అందుకే తమన్నా అయితే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

తమన్నా ఇదివరకు సంపత్ నంది దర్శకత్వం వహించిన బెంగాల్ టైగర్ చిత్రంలో నటించిన సంగతి తెల్సిందే. అక్టోబర్ నెలలో ఈ చిత్రం మొదలుకానుంది.