త‌మ‌న్నా ప‌రీస్థితి ఇక ఇంతేనా?

త‌మ‌న్నా ప‌రీస్థితి ఇక ఇంతేనా?
త‌మ‌న్నా ప‌రీస్థితి ఇక ఇంతేనా?

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇక వెబ్ సిరీస్‌ల‌కే ప‌రిమితం కావాల్సిందేనా?.. అంటే ఆమె వేస్తున్న అడుగులు అదే నిజ‌మ‌ని నిరూపిస్తున్నాయి. ప్ర‌స్తుతం గోపీచంద్ తో క‌లిసి `సీటీమార్‌` చిత్రం, స‌త్య‌దేవ్‌తో క‌లిసి `గుర్తుందా సీతాకాలం` వంటి చిత్రాల్లో న‌టిస్తున్న త‌మ‌న్నా వ‌రుస‌గా వెబ్ సిరీస్‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తోంది.  గత నెలలో `ఆహా` కోసం  ‘11 వ అవర్ ’తో ఓటీటీ ప్ర‌పంచంలోకి ప్రవేశించింది. ప్రవీణ్‌ సత్తారు దీనికి దర్శకత్వం వహించారు.

తాజాగా తమన్నా తన రెండవ వెబ్‌ సిరీస్ తో రెడీ అవుతోంది. మే 14 న డిస్నీ + హాట్‌స్టార్‌లో త‌మ‌న్నా న‌టించిన క్రైమ్ థ్రిల్లర్ `నవంబర్ స్టోరీ` స్ట్రీమింగ్ కాబోతోంది. `నవంబర్ స్టోరీ` త‌న‌కు చాలా గుర్తుండిపోయే ప్రయాణం అని త‌మ‌న్నా ఇటీవ‌ల వెల్లడించింది. `నవంబర్ స్టోరీ` తండ్రి, కూతుళ్ల కుమార్తె మధ్య అనుబంధం నేప‌థ్యంలో రూపొందింది.  క్రిమినల్ అయిన త‌న తండ్రి ప్రతిష్టను కాపాడటానికి ఓ కూతురు చేసిన ప్రయత్నం నేప‌థ్యంలో ఈ సిరీస్‌ని రూపొందించారు. ఇందులో తమన్నా పాత్ర అనురాధ అనే పాత్ర‌లో న‌టించింది.

జిఎం కుమార్, పశుపతి, వివేక్ ప్రసన్న, నమీత కృష్ణమూర్తి త‌దిత‌రులు ఈ సిరీస్‌లో న‌టించారు. ఇంద్ర సుబ్రమణ్యం దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ని ఆనంద వికటన్ నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ మే 14 న తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది.