త‌మ‌న్నా పేరెంట్స్ కు క‌రోనా పాజిటివ్‌‌!


 

Tamanna parents tests corona positive
Tamanna parents tests corona positive

క‌రోనా మ‌హ‌మ్మారి దేశ వ్యాప్తంగా భ‌యాన‌క వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తోంది. ఏ ఒక్కరినీ వ‌ద‌ల‌డం లేదు. సెల‌బ్రిటీల నుంచి సామాన్యుల వ‌ర‌కు ప్ర‌తీ ఒక్కరినీ వ‌ణికిస్తోంది. గ‌త కొన్ని రోజులుగా బాలీవుడ్ సెల‌బ్రిటీలు క‌రోనా  వైర‌స్ బారిన ప‌డుతున్నారు. దీంతో బాలీవుడ్ భ‌యంతో వ‌ణికిపోతోంది. బిగ్‌బి ఫ్యామిలీ క‌రోనా బారిన ప‌డి కోలుకోగా మ‌రి కొంత మంది క‌రోనా బారిన ప‌డ్డారు. బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌, టాలీవుడ్‌కు చెందిన వాళ్ల‌ల్లో కంత మందికి క‌రోనా సోక‌డం.. అందులో కొంద‌రు కోలుకోవ‌డం తెలిసిందే.

తాజాగా క్రేజీ హీయిన్ త‌మ‌న్నా పేరెంట్స్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. దీంతో ఆమె అభిమానులు ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు. త‌మ‌న్నా ప‌రిస్థితి ఏంట‌ని, ఆమెకూ కోవిడ్ సోకి వుంటుందా? అని ఆరాతీస్తున్నారు. ఇదిలా వుంటే త‌మ‌న్నా పేరెంట్స్‌కు మాత్రం క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌ని, త‌మ‌న్నాకు క‌నిపించ‌లేద‌ని తెలిసింది.

`గ‌త వారం అమ్మా నాన్న‌ల్లో స్వ‌ల్పంగా కోవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌ని, ముందు జాగ్ర‌త్త‌గా కుటుంబ స‌భ్యులం కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డంతో అమ్మా నాన్న‌ల‌కు పాజిటివ్ అని తేలింద‌ని త‌మ‌న్నా స్ప‌ష్టం చేసింది. దేవుడి ద‌య వ‌ల్ల నాతో స‌హ మిగ‌తా వారికి టెస్టుల్లో నెగెటివ్ వ‌చ్చింద‌ని త‌మ‌న్నా స్ప‌ష్టం చేసింది.